Friday, April 19, 2024

ఐసీయూ దొరక్క ‘సోలో బ్రతుకే సో బెటర్’ దర్శకుడి తల్లి మృతి

కరోనా కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ఎక్కువగా ఆసుపత్రిలో ఆక్సిజన్, బెడ్స్ లేక చనిపోతున్నారు. అయితే తాజాగా ఐసీయూ అందుబాటులో లేక ప్రముఖ దర్శకుడు తన తల్లిని కోల్పోయాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డైరెక్టర్ సుబ్బు తల్లి మంగమ్మ ఆదివారం రాత్రి మృతి చెందారు. సుబ్బు తల్లి కేవలం ఐసీయూ అందుబాటులో లేక నేను చనిపోయారు అని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇంతకు ముందు ఇలానే ప్రముఖ నటి ఆస్పత్రి ముందే బతిమాలుకున్నా తమ్ముడిని రక్షించుకోలేకపోయింది. ఇటీవల సప్తగిరి లక్ష సాయం చేసినా తన స్నేహితుడైన దర్శకుడిని బతికించుకోలేకపోయారు. కాగా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుబ్బు. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement