Thursday, April 25, 2024

సొగ‌సుకే సోకు సాంగ్ రిలీజ్

‘సిక్స్‌ టీన్స్‌’ సీక్వెల్‌గా ఆ చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఘంటాడి కృష్ణ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు న్నపాన్‌ ఇండియా సినిమా ‘రిస్క్‌’. సిద్‌ శ్రీరామ్‌ పాడిన ‘సొగసుకే సోకు’ తెలుగులో, ‘ఇత్ని ఖూబ్‌ సూరత్‌స‌ హందీలో సింగర్ మ హమ్మద్ హమత్‌ , ‘అజ్హ్హగుకే అజ్హ్హగూట్టన్‌’ తమిళ్‌లో సింగర్‌ అర్జున్‌ విజయ్‌, ‘సొగసిగే మెరుగు’ కన్నడ గీత రచనతో సింగర్‌ సిద్ధార్థ్‌ బేలమన్నుపాడారు. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా ఈ నాలుగు పాటలను విడుదల చేసారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథి గా లెజెండరీ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్‌.రాజు, మైత్రి మూవీ మేకర్స్‌ యలమంచిలి రవి శంకర్‌, హరో ఆదిత్య ఓం, ఉప్పల్‌ ఏం.ఎల్‌.ఏ బేతి సుభాష్‌ రెడ్డి, తెలంగాణ బి సి కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణ రామకృష్ణ రావు, సామజిక వేత్త దుండ్ర కుమార స్వామి, రావి సురేష్‌ రెడ్డి, గడ్డం రవి, విజయ్‌ వర్మ, దర్శకుడు ఆర్‌ కె ఇంకా చిత్రంలోని నటీనటులు సాంకేతికవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తెలుగు లిరికల్‌ సాంగ్‌ విడుదల చేసిన నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్‌.రాజు మాట్లాడుతూ ” సిద్‌ శ్రీరామ్‌ పాడిన ‘సొగసుకే సోకు’ మెలోడీ సాంగ్‌ ఘంటాడి కృష్ణ అద్భుతంగా కంపోజ్‌ చేశారు. ఎంతో రిస్క్‌తో కూ డుకున్న ఈ ప్రాజెక్ట్‌తో విజయం సాధిస్తామని అనుకుంటున్నాను. అన్నా రు. హందీ లిరికల్‌ సాంగ్‌ విడుదల చేసిన హరో ఆదిత్య ఓం ,తమిళ్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల చేసిన ఉప్పల్‌ ఏం.ఎల్‌.ఏ బేతి సుభాష్‌ రెడ్డి , కన్నడ లిరికల్‌ సాంగ్‌ విడుదల చేసిన తెలంగాణ బి.సి కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణ రామకృష్ణ రావు సినిమా గురించి మాట్లాడారు. . చివరగా ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ ‘సిక్స్‌ టీన్స్‌’కు కొనసాగింపుగా రెండవ చిత్రం చేద్దామని చాలా కాలం క్రితం అనుకున్నాను. ఆ చిత్రంలోని దేవుడు వారమందిస్తే.. మన తెలుగులోనే కాదు కన్నడ భాషలో ఫ్రెండ్స్‌ అనే టైటిల్‌తో వచ్చింది. యూనిట్‌ సభ్యుల స#హకారంతో సినిమా తీయడం జరిగింది. ” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement