Thursday, April 18, 2024

చిరున‌వ్వు.. చిరుత క‌ళ్ళ‌తో ఎన్టీఆర్ న్యూ లుక్

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ డిఫరెంట్ మూడ్‌లో ఉన్న స్టిల్స్‌ను నెట్టింట వైరల్ అవుతున్నాయి.చిరు న‌వ్వుతో.. చిరుత కళ్ళతో.. కాలర్‌ ఎగరేస్తున్న స్టిల్‌ అందరి చూపు తన వైపునకు తిప్పుకుంటున్నారు యంగ్ టైగర్. మాస్‌ యాటిట్యూడ్‌ చూపిస్తున్నట్టుగా ఉన్న ఈ స్టిల్‌కు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తారక్ తాజాగా ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ షూట్ లో తీసిన స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన దేవర ఫస్ట్‌ లుక్‌ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. తారక్‌ మరోవైపు కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ 31కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement