Thursday, April 25, 2024

రొమాంటిక్ జోష్ లో శిరీష్.. ఊర్వశివో రాక్షసివో నుంచి టీజర్ రిలీజ్..!

టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ తనయుడు అల్లు శిరీష్‌… ఇప్పటి వరకూ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా బ్రేక్ రాలేదు ఈ యంగ్ హీరోకి.. దీంతో ఈసారి కాస్త డిఫరెంట్ రూట్‌ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఊర్వశివో రాక్షసివో అంటూ ఆడియన్స్ ముందుకు రానున్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్. రాకేశ్ శశి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో అందాల భామ అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఫుల్ రొమాంటిక్ సీన్లతో ఈ టీజర్‌ను నింపేశారు శిరీష్‌, అను ఇమాన్యుయెల్‌.. ఆమె ప్రొసీడ్‌ అవడం చూసి తనను లవ్‌ చేస్తుందేమో అని హీరో అనుకుంటే.. మనం జస్ట్‌ ఫ్రెండ్స్‌ అంతే అంటూ హీరోయిన్‌ చెప్పడమే ఇందులో ట్విస్ట్‌. మూవీలో శిరీష్‌, అను ఒకే ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్స్‌గా కనిపించారు. కాగా, జీఏ2 పిక్చర్స్‌ నిర్మించిన ఈ మూవీ నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement