Thursday, April 25, 2024

పాగల్….సింగిల్ చిన్నోడు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

ఫలక్ నూమ దాస్ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం పాగల్ సినిమా చేస్తున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. కాగా కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సింగిల్ చిన్నోడు లిరికల్ వీడియో సాంగ్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కరోనా సమయంలో ఈ బ్రాండ్ న్యూస్ సాంగ్ తో అందరిని చిల్ చేయాలనుకుంటున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నారు.

https://youtu.be/WjZVvO45nOg
Advertisement

తాజా వార్తలు

Advertisement