Thursday, March 28, 2024

భార్గవ్ లాంటి కామాంధులు మన చుట్టూ చాలామంది ఉన్నారు – చిన్మయి

ఫన్ బకెట్ భార్గవ్ తనను మోసం చేశాడంటూ ఓ మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బాలిక ఫిర్యాదు మేరకు ఫన్ బకెట్ భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా భార్గవ్ బారినపడి ఇంకా ఎంతో మంది యువతులు మోసపోయినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి స్పందించారు.

ఇలాంటి విషయంలో అబ్బాయిలకంటే అమ్మాయిలదే తప్పు అన్నట్లుగా న్యూస్ క్రియేట్ చేయడం బాధాకరమని.. ఇటీవల ఒక న్యూస్ పేపర్ లో తల్లిదండ్రుల అతి గారాబం నిర్లక్ష్యం వలన, అమ్మాయిలకు పూర్తి స్వేచ్ఛ దొరకడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నట్లు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మాయిని బాధితురాలిగా చూపించడం కరెక్ట్ కాదని… ఫన్ బకెట్ భార్గవ్ లాంటి సన్నాసి కామందులు మన చుట్టూ చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. భార్గవ్ గురించి ఇదివరకే కొన్ని ఆరోపణలు రావడం కూడా నేను గమనించానని, అతను స్త్రీ లోలుడు అని అతని మాజి గర్ల్ ఫ్రెండ్ కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిందని తెలిపింది. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని, స్మార్ట్ గా కన్నింగ్ గా మాటలు కలిపి మోసం చేస్తారు. ఇండస్ట్రీలోకి అమ్మాయిలు రావడం తప్పు ఏమీ కాదు.కానీ ఎవరితో స్నేహం చేస్తున్నామనే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement