Thursday, April 18, 2024

సింహాద్రి క‌లెక్ష‌న్స్.. మామూలుగా లేవుగా

రీ రిలీజ్ అయినా క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోంది హీరో ఎన్టీఆర్ న‌టించిన సింహాద్రి బాక్సాఫీస వ‌ద్ద సంచ‌నాలు సృష్టిస్తోంది సింహాద్రి. ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రీ రిలీజ్ అయిన ఈ చిత్రం వ‌సూళ్ల‌తో దూసుకుపోతుంది. రిలీజైన ప్రతీ చోట హౌజ్‌ ఫుల్‌ బోర్డులే కనిపిస్తుంది. కొత్త సినిమా రిలీజైతే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో.. సింహాద్రి రీ-రిలీజ్‌కు కూడా అదే స్థాయిలో సందడి నెలకొంది. థియేటర్‌ల దగ్గర నందమూరి ఫ్యాన్స్‌ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. జై ఎన్టీఆర్, సింగమలై అంటూ నినాదాలు చేస్తున్నారు. రీ-రిలీజ్‌ దెబ్బకి కొత్తగా విడుదలైన సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. సింహాద్రి సినిమా మొదటి రోజు దాదాపు రూ.5.2 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. కొత్త సినిమాలకు కూడా ఈ మధ్య ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు రావడం లేదు. అలాంటిది రీ-రిలీజ్‌ సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు వచ్చాయంటే మాములు విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే తారక్‌కు ఎంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ఏర్పడుతుంది. ఇక సీడెడ్‌లో ఏకంగా రూ.76 లక్షలు సాధించి అక్కడ తన బ్రాండ్‌ ఏంటో మరోసారి రుజువు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement