Thursday, April 25, 2024

శింబు-గౌతమ్ మీనన్ ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టీజర్ రిలీజ్!

హీరో శింబుతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ భాషా రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా ‘వెందు తనింధతు కాదు’. దీనికి తెలుగు వెర్షన్ ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’. రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 15న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ మూవీతో వీరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు. కాగా, ప్రెస్టీజియస్ బ్యానర్ స్రవంతి మూవీస్‌పై తెర‌కుక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ ను ఇవ్వాల (శానివారం) రిలీజ్ చేశారు మేకర్స్.

ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్ల‌స్‌గా నిలుస్తుందని అంటున్నారు. సిద్ధార్థ నుని విజువ‌ల్స్ డీసెంట్‌గా ఉన్నాయి. విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. GVM మార్క్ మేకింగ్‌ను చూడవచ్చు. ఈ చిత్రానికి పాట‌ల‌ రచయిత అనంత శ్రీరామ్ కూడా పనిచేశారు. తాజా టీజర్ అంచనాలను పెంచింది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నీరజ్ మాధవ్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement