Saturday, October 12, 2024

Siddipet singer – ఇండియన్ ఐడల్ తెలుగు రన్నర్ లాస్యప్రియకు మంత్రి హరీశ్ రావు ప్రశంసలు

మొదటి సీజన్ ను ఎంతో విజయవంతంగా పూర్తిచేసిన ఆహా ఒ టి టి ఇప్పుడు ఇండియన్ ఐడల్ తెలుగు -2023 సీజన్ 2 ను కూడా అంతే విజయవంతంగా పూర్తి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతామాధురి న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. ఇక ఈ సీజన్ ఫినాలేకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశాడు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన.. సౌజన్య, జయరాం, లాస్యప్రియ, శృతి, కార్తికేయ పోటాపోటీగా పాడిన తీరు ఆకట్టుకుంది. చివరికి సీజన్ 2 విన్నర్ గా సౌజన్య నిలువగా.. రన్నర్ గా లాస్యప్రియ నిలిచింది. లాస్యప్రియ సిద్ధిపేట యువతీ కావడంతో మంత్రి హరీష్ రావు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

ఇండియన్ ఐడల్ తెలుగు -2023.. సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆయనతో పాటు తెలంగాణకు మంచి పేరు తెచ్చినందుకు ప్రతి ఒక్కరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement