Saturday, April 20, 2024

శ్యామ్ సింగ రాయ్ షూట్ కంప్లీట్…నాని ట్వీట్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగ్ రాయ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కోల్ కత్తా నేపథ్యంలో ఓ సెట్ ను వేసి ఈ సినిమా షూటింగు ను చిత్రయూనిట్ జరిగింది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నెల రోజులు ఆలస్యమైంది. అయితే షూటింగ్ పూర్తయిన సందర్భంగా నాని గొప్ప బృందంతో షూటింగ్ ను పూర్తి చేసాము… మంచి ఫలితం వస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం అంటూ ట్వీట్ చేసాడు నాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement