Thursday, March 28, 2024

శ్యామ్ సింగ రాయ్ స్టార్ట్ అయింది…ఫోటో వైరల్

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే అంటే సుందరానిని సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్ లు రీస్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ కూడా రీస్టార్ట్ అయింది.

జూలై 1 నుంచి అంటే ఈ రోజు నుంచే చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. గతంలో వేసిన సెట్ వర్షం కారణంగా దెబ్బతినడంతో దానిని పునః నిర్మించి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

ఇక గతంలో నాని ఫస్ట్ లుక్ తో పాటు సాయి పల్లవి లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement