Saturday, April 20, 2024

ఆన్‌లైన్ బేబి ష‌వ‌ర్ వేడుక జరుపుకున్న శ్రేయ

ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయ ఘోషాల్ ఆన్ లైన్ బేబి షవన్ వేడుక జరుపుకుంది. త్వ‌ర‌లో ఓ బేబీకి జ‌న్మ‌నివ్వ‌నుంది శ్రేయ. 2015లో త‌న స్నేహితుడు శైలాదిత్యను వివాహం చేసుకుంది శ్రేయ. ఈ క్ర‌మంలో ఆమె బేబి ష‌వ‌ర్ వేడుక జ‌రుపుకుంది. కరోనా నేపథ్యంలో శ్రేయ ఆన్ లైన్ లో వేడుకలను జరుపుకుంది. ప‌లు ర‌కాల వంట‌ల‌ను త‌న ముందు ఉంచుకొని ఆస్వాదిస్తున్న ఫొటోతో పాటు ఆస‌క్తిక‌ర ఫొటోలను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రేయ‌. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రేయ ఘోషాల్ తెలియ‌ని భార‌తీయుడు లేదంటే అతిశ‌యోక్తి కాదు. ప‌లు భాష‌ల‌లో ఎన్నో అద్భుత‌మైన సాంగ్స్ ఆల‌పించిన శ్రేయ అనేక పుర‌స్కారాలు కూడా అందుకుంది. రీసెంట్‌గా తెలుగులో ఉప్పెన మూవీ కోసం శ్రేయా ఘోష‌ల్ జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు పాట‌ను ఆల‌పించారు. జ‌స్రిత్ జాజ్‌తో క‌లిసి శ్రేయా ఈ పాట‌ను పాడ‌గా.. ఇది అంద‌రినీ ఆక‌ట్టుకొని మంచి వ్యూస్‌ని సంపాదించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement