Saturday, April 20, 2024

డ్ర‌గ్స్ కేసులో న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ సోద‌రుడు సిద్ధాంత్ క‌పూర్ అరెస్టు..

ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమారుడు, నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఓ హోటల్‌పై ఆదివారం రాత్రి రైడ్ చేసిన‌ పోలీసులు.. పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నాడు. సిద్ధాంత్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురు డ్రగ్స్ తీసుకుంటున్న వ్య‌క్తుల్ని అరెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు పోలీసులు.

నిందితుల‌ను ఉల్సూరు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బెంగ‌ళూరు పోలీసులు వెల్లడించారు. కాగా, పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సిద్ధాంత్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో, సిద్ధాంత్ DJ వాయిస్తూ కనిపించాడు. మిగిలిన వారు డ్యాన్స్ చేయడం చూడవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement