Tuesday, April 23, 2024

ఒకే ఒక జీవితం అంటూ ఓటీటీలోకి వ‌స్తున్న శ‌ర్వానంద్‌.. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్!

వరుస ఫ్లాపుల్లో ఉన్న శ‌ర్వానంద్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ ఒకే ఒక జీవితం. శ్రీకార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఈ మూవీ ఆడియన్స్‌కు తెగనచ్చేసింది. ఈ సినిమాలో శర్వా యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. శ‌ర్వానంద్ కు జోడీగా రీతూ వర్మ నటించగా అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్‌ కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచుస్తున్న తరుణంలో గుడ్ న్యూస్ వచ్చేసింది.

- Advertisement -

ఒకే ఒక జీవితం ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్.. త్వరలోనే ఈ మూవీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మ ప్రేమ కోసం ఆది (శ‌ర్వానంద్‌) చేసిన టైం ట్రావెల్ ప్రయాణం- ఒకే ఒక జీవితం.. త్వరలో Sony LIV లో చూడండి..’ అంటూ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించి ట్రైలర్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే తేదీ కన్ఫార్మ్ చేయకపోయినా.. త్వరలోనే అని చెప్పడంతో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ వారం లేదా వచ్చే వారంలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చర్స్ ప‌తాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మించగా.. తమిళంలో కణం పేరుతో రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement