Saturday, April 20, 2024

ఉపాసన కోసం…షార్ట్ ఫిల్మ్ లో డాక్టర్ గా శర్వానంద్ ?

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన… రామ్ చరణ్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన అప్డేట్ లతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కరోనా సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలకు సంబంధించి ఒక షార్ట్ ఫిలిం చేయాలని భావిస్తున్నారట ఉపాసన.

అందులో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఫ్రంట్లైన్ వారియర్స్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది చూపించబోతున్నారట. అయితే అందులో డాక్టర్ గా శర్వానంద్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. నిజానికి రామ్ చరణ్ శర్వానంద్ మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ తో ఆపాత్ర చేయిస్తే బాగుంటుందని భావించి శర్వానంద్ కొరారట. అందుకు శర్వా కూడా ఓకే అన్నాడట. ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే ఇటీవల శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. అలాగే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement