Thursday, April 25, 2024

బిగ్ బాస్ కు షణ్ముఖ్ జస్వంత్ డిమాండ్

బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నార్త్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు సౌత్ లో కూడా కొనసాగుతుంది. ఇక తెలుగులో నాలుగు సీజన్ లను పూర్తిచేసుకొని… ఐదవ సీజన్ కి సిద్ధమవుతోంది. కాగా ఈ సీజన్ లో కంటెస్టెంట్ లు వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… అందులో ఒకరు షణ్ముక్ జస్వంత్.

షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 కోసం పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో నిర్వాహకులు అతనితో ప్రోమో ని కూడా సూట్ చేయబోతున్నారట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement