Thursday, April 25, 2024

అపరిచితుడు రీమేక్ – బాలీవుడ్ లో కూడా అతనే

సంచలన దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో ఎన్నో అద్భుత చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వాటిలో అపరిచితుడు సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో విక్రమ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ లోన్నూ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించబోతున్నారట. కాగా పెన్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement