Thursday, April 25, 2024

ఓటీటీ స్టార్ట్ చేయబోతున్న షకీలా !!

షకీలా ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఆ తరం కుర్రవాళ్ళు నుంచి ఈ తరం కుర్రవాళ్ళ వరకు తన అందచందాలతో అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఇక ఇటీవల కాలంలో వయసురీత్యా సినిమాలకు దూరం అయిన షకీలా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆమె రమేష్ కావలి దర్శకత్వంలో అట్టర్ ఫ్లాప్, రొమాంటిక్ రెండు సినిమాలను చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రామానాయుడు స్టూడియోలో నేడు రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలలో నా కూతురు మిలా హీరోయిన్ గా నటిస్తోంది. గోవాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నాం. అయితే సినీరంగంలోకి కొత్తగా వచ్చే వారికి ఇబ్బంది లేకుండా కె.ఆర్ డిజిటల్ ఫ్లెక్స్ పేరుతో సొంతంగా ఓ టి డి ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు షకీలా. ఈ ఓటీటీ లో అనేక షార్ట్ ఫిలిమ్స్ చూడవచ్చని, కొత్తగా ఎవరైనా మంచి షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు చేసినా కూడా ఫ్రీగా సపోర్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement