Friday, April 19, 2024

పఠాన్​ వస్తున్నాడు.. ఓటీటీ రిలీజ్​ డేట్​ ఫిక్స్​ అయ్యిందోచ్​..

కింగ్ ఖాన్ షారుఖ్ లేటెస్ట్ మూవీ ప‌ఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ హై-బడ్జెట్ యాక్షన్ డ్రామా పఠాన్ జనవరి 25న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ బిగ్గీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టించ‌గా భాలీవుడ్ ఖా భాయి స‌ల్మాన్ ఖాన్ స్పెష‌ల్ రోల్ లో క‌నిపించాడు. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. ఇక‌ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.

ఈ సినిమా ఈ నెల (మార్చి) 22న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు, తమిళంలో భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది అమెజాన్.

డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా, సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీలో జాన్ అబ్రహం విలన్. విశాల్-షేకర్ సంగీత దర్శకులుగా ఉన్న ఈ బిగ్గీని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాంక్రోల్ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement