Friday, April 19, 2024

పార్టీలో హీరోయిన్ తో క్లోజ్ గా షారుక్ ఖాన్ తనయుడు

ఆర్య‌న్ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడిగానే కాదు..డ్ర‌గ్స్ కేసులో బాగా ఫేమ‌స్ అయ్యాడు. కాగా ఆర్య‌న్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ బాలీవుడ్ నటితో పార్టీలో ఎంజాయ్ చేస్తూ.. కెమెరాకు చిక్కాడు. అయితే ఆ నటి కూడా స్వయంగా ఆ ఫోటోలను తన ఇన్ స్టా పేజ్ లో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి రోషిని వాలియాతో కలిసి ఓ పార్టీ సందడి చేశాడు ఆర్యన్. వారిద్ద‌రూ కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రోషిని. ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ఎబౌట్ లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ ట్యాగ్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో ఈ హీరోయిన్ సూపర్ హాట్ గా కనిపించింది. ఎద అందాలు బయటపడేలా ఫోటోలు..అది కూడా ఆర్యన్ ఖాన్ తో చాలా క్లోజ్ గా దిగి పెట్టడంతో..నెట్టింట్లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement