Wednesday, March 27, 2024

బంగార్రాజు లో సీనియర్ హీరోయిన్ !!

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. నాగార్జున కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన ఈ చిత్రంకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నాగచైతన్య సరసన ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి కనిపించనుంది.

అలాగే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ శ్రేయ శరణ్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక నాగార్జున కూడా ఈ సినిమా సీక్వెల్ పై అని గట్టిగా అంచనాలు పెట్టుకున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఏమేర సక్సెస్ అవుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement