Friday, April 26, 2024

కూతురు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

నటి సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సురేఖవాణి ఆమెతోపాటు ఆమె కూతురు సుప్రీత నీ పరిచయం చేస్తూ రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే దీంతో సుప్రీత సినీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.

కాగా సుప్రీత సినీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది సురేఖ. సుప్రీత స్టడీస్ తో బిజీగా ఉందని… అలాగే నటనలో కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తెలుగులో స్పష్టమైన డైలాగ్ డెలివరీ కోసం ట్రైనింగ్ తీసుకుంటుందని చెప్పుకొచ్చింది సురేఖ. ఇప్పటివరకు అయితే సినీ ఎంట్రీ అనేది ఫిక్స్ కాలేదని ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా చెప్తాను అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement