Thursday, April 25, 2024

గోపీచంద్ ‘’సీటీమార్’’… ఫస్ట్ కలెక్షన్లు అదుర్స్

గోపీచంద్ లేటెస్ట్ మూవీ “సీటీ మార్” థియేటర్లలో సందడి చేస్తోంది. క‌బ‌డ్డీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సంప‌త్ నంది దర్శకత్వం వహించారు. తమన్నా, దిగంగన సూర్యవంశి హీరోయిన్స్‌గా నటించారు. వినాయకచవితి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సీటీమార్ మూవీకి మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. తొలిరోజున సీటీమార్ రూ.3 కోట్ల  షేర్‌ను వ‌సూలు చేసి ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ త‌ర్వాత దేశంలోనే ఏ సినిమాకు రానంత క‌లెక్ష‌న్స్ ఈ సినిమాకు రావ‌డం విశేషం. నైజాంలో దాదాపు కోటి రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. మిగిలిన చోట్ల అంతా క‌లిసి దాదాపు రూ.2 కోట్ల షేర్ వ‌చ్చింది. గ్రాస్ వ‌సూళ్ల‌ను గ‌మ‌నిస్తే రూ.4.75 కోట్ల రూపాయ‌లు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత.. ఇప్పుడిప్పుడే ప్రేక్షులు థియేటర్ల వైపు వస్తున్నారు. ఇన్నాళ్లు మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కు సీటీమార్ మూవీ కొంచం రిలీఫ్ ఇచ్చింది. ఫుల్ వీక్ లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement