Friday, March 29, 2024

పిసినారి సునీల్ పై అదిరిపోయే సీన్స్ తెరకెక్కిస్తున్నారట !!

విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఎఫ్2 కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో సునీల్ ఓ పిసినారి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పిసినారి దగ్గర వెంకీ , వరుణ్ తేజ్ లో పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకుంటారట. అది చెల్లించడానికి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారట.

ఈ పాయింట్ చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట. సునీల్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు… ఆ సొమ్మును ఎలా రాబెడతాడు అనే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవబోతున్నాయట. ఇక ఈ సినిమాలో తమన్నా మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement