Thursday, April 18, 2024

‘సత్యమేవ జయతే’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. నివేదాథామస్,అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో సత్యమేవ జయతే ఫుల్ వీడియో సాంగ్ ఆదిత్య మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా…తమన్ మ్యూజిక్ అందించారు. శంకర్ మహదేవన్, పృథ్వి చంద్ర ఆలపించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా లోని మగువా మగువా ఫుల్ వీడియో సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement