Thursday, April 25, 2024

గుర్తుందా శీతాకాలం అంటూ తమన్నాతో సత్యదేవ్​ రొమాన్స్​.. డిసెంబర్​ 9న రిలీజ్​కు రెడీ​

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇటీవల ‘గాడ్సే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే త్వరలో సత్యదేవ్ నటించిన లవ్ స్టోరి ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల కానుంది. కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుర్తుందా శీతాకాలం’..డెఫినెట్ గా తెలుగులో హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నాయి.

ఇక ఈ సినిమాలో సత్యదేవ్, తమన్నా రొమాన్స్ హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఇప్పటికే చాలా సార్లు విడుదల తేదీలను ప్రకటించి వాయిదా వేసిన మేకర్స్ తాజాగా.. ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్‌ 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement