Saturday, April 20, 2024

సత్యదేవ్…లాక్డ్ 2 త్వరలో సెట్స్ పైకి

లాక్డ్‌ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆహా లో ప్రసారమైన లాక్డ్ సీజన్ వన్ కు కంటిన్యూగా ఇది తెరకెక్కబోతుంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులను పరిష్కరించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు. అయితే తన పేరు ప్రతిష్టలను నాశనం చేయగల రసాయనాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు.

అయితే సీజన్ వన్ కు దర్శకత్వం వహించిన ప్రదీప్ దేవకుమార్ సీజన్ 2 కి కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే సీజన్ వన్ లో చిన్న చిన్న దొంగతనాలు చేసే ముగ్గురు దొంగలు డాక్టర్ ఆనంద్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఆనంద్ జీవితంలోని చీకటి కోణం గురించి తెలుస్తోంది. ఆ ఇంట్లోకి వెళ్లిన వారంతా నిమిషాల్లో హతం అవుతూ ఉంటారు. అయితే సీజన్ 2 తో సత్యదేవ్ ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement