Friday, April 19, 2024

స‌ర్కారు వారి పాట నుండి ఫ‌స్ట్ సింగిల్ ఎప్పుడంటే

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తోన్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రాన్ని ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ న‌టిస్తోంది. ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ సంక్రాంతికి వ‌స్తుంద‌నుకున్నారు. కానీ రాలేదు. ఇక ఇప్పుడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. తమన్ పై ఈ పోస్టర్ ను రిలీజ్ చేయడం విశేషం. తనకి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ విషయంలో తమన్ ఎంత చురుకుగా ఉంటాడనేది తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement