Friday, April 19, 2024

‘సర్కారు వారి పాట’ టీజర్ కూడా అప్పుడే ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదిలా ఉండగా మే నెలలో ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ రాబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ అప్డేట్ రాబోతోంది. అయితే ఆ అప్డేట్ ఏంటి అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మొదట ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు అంతకుమించి ట్రీట్ ఉంటుందని తెలుస్తోంది. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన టీజర్ కూడా వస్తుందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా టీజర్ ను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ టీజర్ రిలీజ్ అయితే మహేష్ ఫ్యాన్స్ కు పండగే.

Advertisement

తాజా వార్తలు

Advertisement