Monday, October 14, 2024

Saripodhaa Sanivaaram ఓటీటీ డేట్‌ ఫిక్స్ !

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన యాక్ష‌న్ ఎంటర్‌‌టైనర్ ‘‘సరిపోదా శనివారం’’. ఆగస్టు 29వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదల తేదీని ఓటీటీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రం ఈ నెల (సెప్టెంబర్ 29 నుండి) ప్రముఖ డిజిటల్ స్ట్రిమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

కాగా, ఈ సినిమాలో నాని సరసన కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా… సూర్య విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement