Saturday, March 23, 2024

సారంగదరియాకు సాటేది !!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ , లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని సారంగదరియా పాట సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తుంది.

తాజాగా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ని ఈ పాట అందుకుంది. టాలీవుడ్ హిస్టరీ లో అతి తక్కువ సమయం లో మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డు సృష్టించింది. మంగ్లీ పాడిన ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించారు. ఫిబ్రవరి 28 న ఈ పాత విడుదల అయింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement