Thursday, March 28, 2024

సంజయ్ దత్ బర్త్ డే స్పెషల్… కే జి ఎఫ్ 2 నుంచి మరో అప్డేట్ !!

రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెకెక్కిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అలాగే కలెక్టన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్లను సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. రేపు జూలై 29 న సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఈ సినిమా నుంచి రానుందట. ఇక ఈ సినిమాలో అధీర అనే ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు సంజయ్ దత్. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరి బర్త్ డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement