Friday, November 8, 2024

Samyuktha Menon | లేడీ ఓరియెంటెడ్ మూవీలో సంయుక్త‌…

సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ తన ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకుంటోంది. ఇప్పటి వరకు తాను చేసిన పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ అందాల భామ, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వస్తోంది. సాధారణంగా గ్లామర్ హీరోయిన్స్ నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాల వైపు కేవలం తమ కెరీర్‌లో ఒక స్థాయిని చేరుకున్న తర్వాతే మొగ్గు చూపుతారు.

అయితే సంయుక్త, తన కెరీర్ ప్రారంభంలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, ఈ కొత్త ప్రయోగంలోకి అడుగుపెట్టింది. రాజేష్ దండా నిర్మాణంలో హాస్య మూవీస్ పతాకంపై ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాను రూపొందిస్తున్నారు. రాజేష్ ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ‘మజాకా’ అనే సినిమా తీస్తున్నారు. ‘మజాకా’ పూర్తయిన వెంటనే సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో రూపొందించే ఈ కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి యోగేష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవం రేపు లాంఛనంగా జరగనుంది. సంయుక్త ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనుండగా, ఈ ప్రాజెక్టుకు సంబందించిన వార్తలు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉన్నత స్థాయి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటనకు మంచి అవకాశం ఉందని తెలుస్తోంది. కథ వినగానే రెండు రోజుల్లోనే సంయుక్త ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిందట. కథా నేపథ్యంలో కొత్తదనం ఉండటమే కాకుండా, తన పాత్రకు గల ప్రాధాన్యత సంయుక్తను ఆకట్టుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement