Tuesday, April 16, 2024

సంపూని సరికొత్తగా చూస్తారు…

సంపూర్ణేష్‌ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్‌.ఆర్‌.రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ధగడ్‌ సాంబ’. నిర్మాత అర్‌.ఆర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్‌ సారథి స్టూడియోలో చివరి పాట చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం షూటింగ్‌ అనంతర పనులు జరుగుతున్నాయి. ‘ధగడ్‌ సాంబ’ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్‌ ఫైట్స్‌ సంపూర్ణేష్‌ చేశారు.

ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారని చిత్రబృందం అంటోంది. ఇందులోని పాటల కోసం సెట్స్‌ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్‌ తనదైన శైలిలో స్టెప్స్‌ వేశారు. ‘ధగడ్‌ సాంబ’ చిత్రంలో హీరోయిన్‌ సోనాక్షి నటన ప్రత్యేక ఆకర్షణ కానుంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement