Friday, April 26, 2024

OTTలోకి త్వ‌ర‌లో రానున్న‌ సమ్మతమే.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచి అంటే..!

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి న‌టించిన‌ రొమాంటిక్ మూవీ సమ్మతమే. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ లో కంకణాల ప్రవీణ నిర్మంచ‌గా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అయితే.. థియేట్రికల్ రన్ టైమ్ లో ఈ సినిమా ప్రేక్షకులను అంత‌గా మెప్పించలేకపోయింది. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత OTTలోకి రానుంది.

కాగా, ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ఆహా వీడియోస్ సోంతచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆహా వేదిక‌గా ప్రసారం కానుందని ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రకటన కూడా వ‌చ్చేసింది. అయితే అధికారిక రిలీజ్ డేట్ మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ, జులై 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement