Sunday, October 6, 2024

సమంత ‘యశోద’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. అమెజాన్‌లో స్ట్రీమింగ్

సమంత నటించిన యశోద గత నెల (నవంబర్)11న థియేటర్లలో రిలీజ్ అయింది. మెదట మూవీకి వచ్చిన రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లని అందుకుంది. అయితే, మీడియం రేంజ్ సినిమాకి పబ్లిక్ టాక్ చాలా కీలకం.. మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజులకే పబ్లిక్‌ టాక్‌ స్లో అయింది.. దీంతో యశోద సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్లను రాబట్టలెకపోడంతో యావరేజ్ గా నిలిచింది.

ఈ చిత్రం థియేట్రికల్ రన్ అయిన వెంటనే OTTలో రిలీజ్ కి ప్లన్ చేశారు మేకర్స్. అయితే కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. అయితే, తాజాగా యశోద మూవీ నిర్మాతలు సినిమా పోస్ట్-థియేట్రికల్ OTT స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ కి ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ సినమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో డిసెంబర్ 9ని విడుదల కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement