Thursday, March 28, 2024

సమంత వెబ్ సిరీస్ రిలీజ్ అప్పుడే ?

ఇటీవల కాలంలో డిజిటల్ రంగానికి ఆదరణ బాగా పెరిగింది. వెబ్ సిరీస్ లను, మూవీ ఓటీటీ లలో చూసేందుకు ఆసక్తి కనిపిస్తున్నారు సినీ అభిమానులు. అయితే ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ గురించి ఎదురుచూస్తున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే కొన్ని రోజుల క్రితం జూన్ లో సిరీస్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అందులో భాగంగానే జూన్ 4, 11, 14వ తేదీ లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ మూడు డేట్ లలో ఏ తేదీన చేస్తారో తెలియాల్సి ఉంది. నటుడు మనోజ్ భాజ్ పై మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తుండగా సమంత అక్కినేని మరో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement