Wednesday, April 24, 2024

సమంత చేతులమీదుగా…పుష్పక విమానం కల్యాణం సాంగ్

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పుష్పకవిమానం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు దామోదర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గతంలో సీలక అనే పాట లిరికల్ వెర్షన్ ను రిలీజ్ చేసింది.

తాజా గా కళ్యాణం అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను అక్కినేని సమంత చేతుల మీదుగా రిలీజ్ చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ సమంత చెప్పారు. ఇక ఈ పాటను శ్రీరామ్ తో కలిపి మంగ్లీ పాడారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement