Tuesday, September 21, 2021

చైతూని విన్నర్ గా ప్రకటించిన సమంత

అక్కినేని జంట నాగ చైతన్య- సమంత మధ్య దూరం పెరిగిందని ఇద్దరూ విడాకులు తీసుకోవాలని ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం వీరి గురించి మాట్లాడేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సమంత ఒంటరిగా టూర్లకు వెళ్లడం ట్విట్టర్లోనూ అక్కినేని అనే పదాన్ని తీసేయడం తో నిజంగానే చైతు శ్యామ్ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే చైతూ సోమవారం పెట్టిన ట్వీట్​కు సమంత రీట్వీట్ చేసింది. అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి.

నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘లవ్​స్టోరి’ ట్రైలర్.. సోమవారం విడుదలైంది. దీనిని చైతూ తన ట్విట్టర్​లో షేర్ చేయగా.. ‘విన్నర్.. ఆల్ ది బెస్ట్ టూ టీమ్’ అంటూ దానికి రీట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News