Saturday, April 20, 2024

సమంత ఫోటో వైరల్….లక్షల్లో లైక్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అక్కినేని నాగచైతన్య భార్య సమంత గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన సమంత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఓ ఫోటోని సమంతా పోస్ట్ చేసింది . ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆమె షేర్ చేసిన ఈ ఫోటోకు గంటల వ్యవధిలోనే రెండు లక్షల కు పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా చేస్తోంది . గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement