Thursday, April 25, 2024

ట్విట్ట‌ర్‌లో మ‌ళ్లీ ప్రొఫైల్ పేరు మార్చేసిన స‌మంత‌!

టాలీవుడ్ జంట‌ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. నిన్న‌ సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా తాము విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం స‌మంత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చ‌డంతో ఆమె నాగ‌చైత‌న్య‌తో విడిపోనుంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. నాగ చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె ట్విట్ట‌ర్‌లో త‌న‌ పేరును స‌మంత అక్కినేనిగా మార్చుకోగా, కొన్ని నెల‌ల క్రితం అక్కినేని పేరును తొల‌గించింది. త‌న పేరును ‘ఎస్’ గా పెట్టుకుంది. త‌న పేరులో మొద‌టి అక్ష‌రాన్ని మాత్ర‌మే ఆమె ఉంచింది. నిన్న చైతూతో విడిపోతున్నాన‌ని ఆమె అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ‘ఎస్’ అక్ష‌రాన్ని తొల‌గించి ‘స‌మంత’గా మార్చేసుకుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు స‌మంత అంటూ ఆమె అభిమానులు బాధ‌ప‌డిపోతున్నారు.

ఇది కూడా చదవండి: మోస‌గాళ్లు బాగుప‌డ‌లేర‌న్న సిద్దార్థ్..నిజ‌మేన‌న్న పూన‌మ్ కౌర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement