Thursday, April 25, 2024

ఆఫ‌ర్లు వ‌స్తున్నా వ‌ద్దంటున్న‌ స‌మంత‌.. ఎందుకో తెలుసా?

బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతోంది ఉన్న స్టార్ హీరోయిన్ స‌మంత. ఈ అమ్మ‌డు చేతిలో ఉన్న శాకుంత‌లం ప్రాజెక్టు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ మూవీ య‌శోద లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది శామ్. దీంతోపాటు హిందీలో వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే శామ్‌కు సంబంధించిన ఓ వార్త ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. హిందీలో ఈ చిన్న‌దానికి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తుండ‌గా.. వాటిని తిర‌స్క‌రిస్తోంద‌ని రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ హిందీలో మంచి ఫేమ్‌ సంపాదించాల‌ని ఫిక్స‌యిన స‌మంత‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నా ఎందుకు నో చెప్తుంద‌నే క‌దా మీ డౌటు. ఈ భామ‌కు రెండో ఫీమేల్ లీడ్ రోల్ కానీ, లేదా న‌ట‌న‌కు అంత ఆస్కారం లేని పాత్ర‌లు వ‌స్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మట‌.

స‌మంత భారీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో అయితేనే న‌టించేందుకు రెడీగా ఉంద‌ని బీటౌన్ స‌ర్కిల్ టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ చెన్నై సుంద‌రి త్వ‌ర‌లోనే బాలీవుడ్ డెబ్యూ సినిమాకు సంబంధించిన పెద్ద ప్ర‌క‌ట‌నే చేయబోతుంద‌న్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. శామ్ ప్ర‌స్తుతం శివ‌శిర్వాణ‌-విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ‌భాగం క‌శ్మీర్‌లో జ‌రుగనుంది. ఖుషి టైటిల్‌ను ఫిక్స్ చేయ‌గా..ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని మ‌రింత పెంచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement