Thursday, April 25, 2024

సమంత సినిమాలో అల్లు అర్జున్ కూతురు

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ అర్హ కు సంబంధించిన వీడియోలను అలాగే ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అర్హ. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్హ ను ఓ కీలకమైన పాత్ర కోసం దర్శక నిర్మాతలు సంప్రదించార.

అయితే అల్లు అర్జున్ కూడా ఇదే సరైన సమయం అని ఓకే చెప్పారట. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చిత్రయూనిట్ చేసింది. పది రోజుల పాటు ఆమె పై షూట్ చేయబోతున్నారట. ఈ షెడ్యూల్ తో ఆమె షూటింగ్ కూడా పూర్తి కాబోతుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement