Thursday, April 18, 2024

పుష్పక విమానం సాంగ్ ను రిలీజ్ చేయబోతున్న సమంత

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి పరిచయం అవసరం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆనంద్. ఆ తర్వాత మిడిల్ క్లాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. ప్రస్తుతం పుష్పకవిమానం సినిమా చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. నూతన దర్శకుడు దామోదర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని నటిస్తోంది.

ఇక ఈ సినిమాను విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ అలాగే టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిలక అనే లిరికల్ వీడియోను గతంలో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయబోతున్నారు. కల్యాణం… అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ను హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేయనుంది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఇది విడుదల చేయనున్నారు. ఈ మేర ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement