Wednesday, April 24, 2024

ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమాలో సమంత ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంతా బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా… దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో అమితాబ్ పాల్గొన్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో అక్కినేని సమంత కీలక పాత్రలో నటించబోతున్నారట. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు తర్వాత ప్రాముఖ్యత ఉన్న ఓ పాత్ర కోసం సమంతను సంప్రదించారట. అయితే ఇది డీగ్లామర్ పాత్ర అని తెలుస్తోంది. గతంలో సమంత రంగస్థలం, ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లలో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement