Tuesday, April 23, 2024

సమంత క్రేజ్.. హాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్

స్టార్ హీరోయిన్ స‌మంత హాలీవుడ్ చిత్రానికి సంత‌కం చేసింద‌ట‌. చెన్నై స్టోరీ టైటిల్ తో ఇంగ్లీష్ మూవీ తెరకెక్కుతుండగా హీరోయిన్ గా సమంతను ఎంచుకున్నారట. ఇది విదేశీ యువకుడు.. చెన్నై అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ అట. హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడు. ఫిలిప్ జాన్ చిత్ర దర్శకుడు కాగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందట. ప్రస్తుతం సమంత ఖుషి, సిటాడెల్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి షూట్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కి ఖుషి సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల నేపథ్యంలో ప్రొమోషన్స్ షురూ చేశారు. సాంగ్స్ విడుదల చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. అలాగే సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో కంప్లీట్ చేశారు. సహ నటుడు వరుణ్ ధావన్, సమంత మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement