Thursday, April 25, 2024

సోషల్ మీడియాలో పేరు మార్చుకున్న సమంత

సోషల్ మీడియాలో హీరోయిన్ అక్కినేని సమంత ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అలాగే సమంతకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కొంతమంది హీరోలకు లేని ఫాలోయింగ్ కూడా ఈ అమ్మడికి ఉందంటే అతిశయోక్తి కాదు… సమంతకు ఫేస్ బుక్ లో మొత్తం 19 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో 17 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ట్విట్టర్ లో 8.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ లో సమంత పేరు సమంత రూత్ ప్రభు ఫేస్ బుక్ లో సమంత అక్కినేని అని రాసుకున్న సమంత… ఇప్పుడు ట్విట్టర్ లో తన పేరును మార్చేసింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును కేవలం ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచుకొని మిగతాదంతా తీసేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement