Saturday, April 20, 2024

అల్లు అర్జున్ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు – సీటిమార్ హిందీ సాంగ్ రిలీజ్

ప్రభుదేవా దర్శకత్వంలో… సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే. అయితే ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన DJ చిత్రానికి సంబంధించి సీటిమార్ పాట ను రీమేక్ చేశారు. కాగా ఈ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.

థాంక్యూ అల్లుఅర్జున్.. సీటిమార్ సాంగ్ లో మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీ డాన్స్ స్టైల్.. మీరు సింపుల్ ఫెంటాస్టిక్. మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండండి. థాంక్యూ బ్రదర్ అంటూ ట్వీట్ చేసాడు. ఈ పాట తీసుకోవడానికి ముందు దర్శకుడు ప్రభుదేవా దేవి శ్రీ ప్రసాద్ నుంచి పర్మిషన్ తీసుకున్నాడట.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement