Friday, April 26, 2024

లుసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ?

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వం లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు చిరు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ స్టార్స్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడట మోహన్ రాజా.

లుసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రకు సత్యదేవ్ ని ఎంపిక చేశారని… చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఒరిజినల్ వెర్షన్ లో పృధ్విరాజ్ సుకుమార్ కనిపించిన పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ను అనుకుంటున్నారట. ఈ మేర మెగాస్టార్ చర్చలు కూడా జరిపారట. మెగా ఫ్యామిలీ లో ఉన్న అనుబంధం తో నటించడానికి సల్మాన్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement