Friday, April 19, 2024

బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న సాయి పల్లవి ?

సాయి పల్లవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయిపల్లవి. అయితే హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస అవకాశాలను అందుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం సాయి పల్లకి లో ఓ హిందీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఇక మొదటి నుంచి కూడా సాయి పల్లవి ఎంతో సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది.

కాగా ఈ బాలీవుడ్ సినిమాకి కూడా సాయి పల్లవి ఓకే చెప్పిందని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం క్లారిటీ రాలేదు. నిజం ఎంత వరకు ఉందో తెలియాలంటే మాత్రం సాయి పల్లవి నుంచి లేదా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ చిత్రం, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలాగే శ్యామ్ సింగ రాయ్ చిత్రం షూటింగ్ దశలో ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement